Sunday, November 17, 2024

గద్దర్ అంతిమయాత్రలో భారీగా అభిమానులు, కళాకారులు

ప్రజాయుద్ధనౌక గద్దర్‌ అంతిమయాత్ర ఎల్బీ స్టేడియం నుంచి గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం, అల్వాల్‌లోని ఆయన నివాసానికి కొనసాగనుంది. గద్దర్‌ పార్ధివదేహాన్ని అల్వాల్‌లోని ఆయన నివాసం దగ్గర కొద్ది సమయం ఉంచి, తర్వాత ఆయన స్థాపించిన మహాబోధి విద్యాలయంలో అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ట్యాంకుబండ్ అంబేద్కర్‌ విగ్రహం దగ్గర అంతిమయాత్రను కొద్దిసేపు నిలపివేయనున్నారు. నిన్నటి నుంచి ప్రజాగాయకుడు గద్దర్‌ను చివరిసారి చూసేందుకు ఆయన అభిమానులు, కళాకారులు, ప్రజలు భారీ సంఖ్యలో ఎల్బీ స్టేడియం వద్దకు తరలివచ్చారు. గద్దర్‌ భౌతికకాయాన్ని చూసి అనేకమంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌, ఎంపీ కోమటిరెడ్డి తదితర నేతలు గద్దర్‌కు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular