Tuesday, May 13, 2025

బిఆర్‌ఎస్‌కు మరో షాక్

  • కారు దిగి హస్తం పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
  • పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన సిఎం రేవంత్

రాష్ట్రంలో అధికారం కోల్పోయి, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బిఆర్‌ఎస్ పార్టీకి వరుసుగా షాకులు తగులుతున్నాయి. కారు గుర్తుపై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలు ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే గులాబీ బాస్‌కు మరో షాక్ తగిలింది.

తాజాగా, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి శనివారం ఉదయం సిఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ సమక్షంలో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు సిఎం రేవంత్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి సాదారంగా ఆహ్వానించారు. కాగా, ఈ రెండురోజుల్లో మరో ఆరుగురు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com