సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పర్యటన వివాదంగా మారింది. సూర్యాపేట జిల్లా నెరేడుచర్లలో ధాన్యం ఆరబోసుకున్న పొలం వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని, అర్జెంట్‌గా ధాన్యం మొత్తాన్ని ఖాళీ చేయాలని అధికారులు హుకుం జారీ చేశారు. దీంతో సొంత పొలంలో ఆరపోసుకున్న వడ్లు తీసేయాలని రైతుల మీద అధికారుల ఒత్తిడి తెచ్చారు. మేం చెప్తే ఇప్పటికిప్పుడు వడ్లు తీయాల్సిందేనని, వీడియోలు తీసి ఏం చేస్తారు.. ఏం చేయలేరు అంటూ స్థానిక తాసీల్దార్ రైతులపై దౌర్జన్యం చేశారు. రైతులను తీవ్రంగా బెదిరించారు. అయితే, ఇప్పటికిప్పుడు వడ్లు తీయాలంటే కుదరదని, అయినా మా సొంత పొలంలో వడ్లు
ఆరబోసుకున్నాం.. హెలిప్యాడ్ కోసం మా వడ్లు ఎందుకు తీయాలి అని అధికారులను రైతులు నిలదీశారు. రైతులను వేధిస్తున్నారని అధికారులపై మండిపడ్డారు.