రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న భారీ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మేకర్స్ ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇటీవలే అమెరికాలోని డల్లాస్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మూవీ నుంచి మూడు పాటలతో పాటు టీజర్‌ను కూడా విడుదల చేశారు. అయితే, విడుదల తేదీ దగ్గర పడుతున్నప్పటికీ ఇప్పటివరకు సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయకపోవడంపై ఓ అభిమాని నిరాశ వ్యక్తం చేశాడు. ఏకంగా సూసైడ్ లెటర్ రాసి మరీ మేకర్స్‌కి షాకిచ్చాడు. మూవీ ట్రైలర్ విడుదలపై వెంటనే అప్‌డేట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆ లేఖ ద్వారా బెదిరించాడు. దీంతో ప్రస్తుతం చెర్రీ ఫ్యాన్ సూసైడ్ లెటర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఆ లెటర్‌లో ఏముందంటే..
గౌరవనీయులైన గేమ్ ఛేంజర్ గారికి నేను.. అనగా ఈశ్వర్, చరణ్ అన్న ఫ్యాన్. చింతిస్తూ రాయునది ఏమనగా.. సినిమా విడుదలకు ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మీరు ఏ విధమైన ట్రైలర్ అప్‌డేట్ ఇవ్వడం లేదు. కనీసం అభిమానుల భావోద్వేగాలను పట్టించుకోవడం లేదు. ఈ నెల ఆఖరు కల్లా ట్రైలర్‌పై అప్‌డేట్ ఇవ్వకపోతే, కొత్త సంవత్సరం కానుకగా ట్రైలర్ విడుదల చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడుతానని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇట్లు మీ విధేయుడు, చరణ్ అన్న భక్తుడు ఈశ్వర్ అని లేఖలో రాసుకొచ్చాడు. ఇప్పుడీ సూసైడ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక సినిమా కోసం మొత్తం ఈ లోకాన్నే విడిచి వెళ్లాలనుకోవడం ఎంత ఫూలిష్‌నెస్‌గా జనాలు ఆలోచిస్తున్నారో అర్ధం కావడం లేదు. ఇటీవలె పుష్ప ఘటనలో ఓ మహిళ ఆకస్మికంగా మరణించి తన కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషయం అందరికీ తెలసిందే. ఆ కుటుంబం ఆ వ్యక్తిని కోల్పవడం వల్ల ఎంత ఇబ్బందులకు గురవుతున్నారు అన్నది ప్రస్తుతం అందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఇలాంటి లెటర్లు రావడంపై అభిమానులు ఏ విధంగా ఆలోచిస్తున్నారని కొంత మంది నెటిజన్లు మండిపడుతున్నారు. కేవలం ఒక సినిమా ట్రైలర్ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారా… ఇదేమైనా గ్రూప్1 పరీక్షలా లేక ఏదైనా ఉద్యోగరిత్యా సమస్య అలాంటి వాటినే నేడు ప్రజలు చాలా లైట్ తీసుకుంటున్నారు. ఒకసారి పాస్ కాకపోయినా మరోసారి ప్రయత్నిద్దామనే ఆలోచనలో ఉంటున్న నేటి సమాజంలో ఇలాంటి పిచ్చి చేష్టలు చేసి అటు సెలబ్రెటీలను.. ఇటు కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చెయ్యడం తప్పించి వేరే ఏమీ కపిపించడం లేదని కొందరు భావిస్తున్నారు.