Saturday, April 19, 2025

వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదు హుస్సేన్ సాగర్‌ చుట్టూ ఇనుప కంచెలు!

హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జానాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ట్యాంక్‌బండ్‌ మార్గంలో జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ పోలీసుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాగర్ లో నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. వినాయక విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో వేయకుండా చుట్టూ ఇనుప కంచెలను కూడా పెట్టారు. అయితే ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై జీహెచ్‌ఎంసీ అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

మరోవైపు హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జానాలు చేయవద్దని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదంటూ లాయర్‌ వేణుమాదవ్‌ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇందులో హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలని ఆయన కోరారు. రంగులతో తయారు చేయబడిన వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడం వల్ల సాగర్ అధికంగా కలుషితం అవుతుందని.. సాగర్ లో వినాయక నిమజ్జనాలు చేయరాదంటూ గత ఏడాది హైకోర్టు తీర్పు వెల్లడించింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com