Saturday, May 17, 2025

గన్నవరం మండల టీడీపీ అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తి.

వాచ్ మెన్ గమనించి పట్టుకునేందుకు ప్రయత్నం.వాచ్ మెన్ పై దాడికి తెగబద్ద దుండగుడు. వాచ్ మెన్ కేకలు వేయడంతో దుండగుడిని పట్టుకున్న జాస్తి వెంకటేశ్వరరావుతో మరికొందరు స్థానికులు. పోలీసులకు సమాచారం అందించిన జాస్తి వెంకటేశ్వరరావు. దుండగుడిని పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.

వివరాలు సేకరిస్తున్న పోలీసులు. గత వైసీపీ ప్రభుత్వంలో జాస్తి వెంకటేశ్వరరావు ఇల్లు,కారు పై దాడి చేసిన కొందరు అల్లరి మూకలు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు. ఇప్పుడు గుర్తుతెలియని వ్యక్తి అర్ధరాత్రి ఇంటికి రావడంపై పలు అనుమానాలు. అసలు జాస్తి వెంకటేశ్వరరావు ఇంటికి వచ్చిన వ్యక్తి ఎవరు? ఎందుకు వచ్చాడు అనేది తెలియాల్సి ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com