Monday, November 25, 2024

బాధితులకు అండగా ఉంటాం

  •  ఎలాంటి ఆందోళన వద్దు.. చికిత్స ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది
  • జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టీజీ.భరత్

అనంతపురం: గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు – ఆటో ఢీకొన్న ప్రమాద ఘటనలో మృతిచెందిన, గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టీజీ.భరత్ భరోసా ఇచ్చారు.

ఆదివారం అనంతపురం నగరంలోని కిమ్స్ సవేరా ఆస్పత్రిలో గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు – ఆటో ఢీకొన్న ప్రమాద ఘటనలో మృతిచెందిన, గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు టీజీ.భరత్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు, జిల్లా ఎస్పీ పి.జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో జిల్లా ఇన్చార్జ్ మంత్రి మాట్లాడారు. డాక్టర్లు బాగా వైద్యం అందిస్తున్నారా, ప్రమాదం ఎలా జరిగింది అంటూ వివరాలు ఆరా తీశారు. మంత్రి టీజీ.భరత్ మాట్లాడుతూ గాయపడిన వారికి ఎలాంటి ఆందోళన వద్దని ధైర్యం చెప్పారు. చికిత్స ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. 24 గంటలు దాటిన తర్వాత బాధితులకు మళ్ళీ సిటీ స్కాన్ చేయాలని, అనంతరం కూడా ఇంకా చికిత్స అవసరమైతే ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని తెలిపారు. బాధితులకు మంచి చికిత్స అందించాలన్నారు. ఈ సందర్భంగా ప్రమాద వివరాలను, అనంతరం చికిత్సకి సంబంధించిన వివరాలను జిల్లా ఇన్చార్జ్ మంత్రికి జిల్లా కలెక్టర్ వివరించడం జరిగింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular