వంట గ్యాస్ ధర స్వల్పంగా తగ్గింది. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.7 తగ్గిస్తున్నట్లు కేంద్ర చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,797కు తగ్గింది. తగ్గించిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. అయితే, 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. గత ఐదు నెలలుగా పెరుగుతూ వచ్చిన వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర జనవరిలో స్పల్పంగా తగ్గింది. 2025 జనవరి 1న 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.14.5 మేర తగ్గింది.
గ్యాస్ సిలిండర్ ధరలను ఎక్కడ చెక్ చేయాలి?
ఎల్ పీజీ సిలిండర్ అసలు ధరలను తెలుసుకోవాలనుకుంటే ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్సైట్ https://iocl.com/prices-of-petroleum-productsలో చూడవచ్చు. ఇదే వెబ్సైట్లో ఎల్పీజీ ధరలతోపాటు, జెట్ ఫ్యూయెల్, ఆటో గ్యాస్, కిరోసిన్ మొదలైన ఇంధనాల ధరలను కూడా తెలుసుకోవచ్చు.