Thursday, May 15, 2025

తెలంగాణ నుంచి 30ల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ బియ్యం సేకరణ

  • ఆదేశాలు విడుదల చేసిన కేంద్రం
  • ధన్యావాదాలు తెలిపిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

టీఎస్​, న్యూస్:2023-24 ఖరీఫ్, రబీ సీజన్ లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు గానూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయుష్ గోయల్‌కు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ధన్యవాదములు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా తెలంగాణ రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా కనీస మద్దతు ధరను, రాష్ట్ర ప్రభుత్వం హామీగా ఇచ్చిన రూ. 500 బోనస్ ను చెల్లించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల నుంచి వరిధాన్యాన్ని వెంటనే సేకరించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు లబ్ధి చేకూరేందుకు వీలున్న అన్ని మార్గాల్లో కేంద్ర ప్రభుత్వం తనవంతు కృషిచేస్తోందని కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com