Friday, February 21, 2025

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి

టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌.
‌యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకులకు దిశానిర్దేవం

దేశ భవిష్యత్‌ ‌యువకుల చేతిలోనే ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. ఆదివారం గట్టుపల్లిలోని ఓ రిసార్ట్‌లో యువ క్రాంతి బూనియాది ట్రైనింగ్‌ ‌క్యాంపును యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌నూతన అధ్యక్షుడు శివ చరణ్‌ ‌రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్‌కుమార్‌ ‌గౌడ్‌ ‌మాట్లాడుతూ.. రాబోయే దేశ భవిష్యత్‌ ‌రాహుల్‌  ‌గాంధీ దేనిని ఆయన పేర్కొన్నారు. యువత  రాజకీయాల్లో రాణించినప్పుడే దేశం శరవేగంగా  రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందని అన్నారు.

తెలంగాణ  రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రావడానికి  ఎన్‌ఎస్‌యుఐ, యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకుల శ్రమ ఎంతో ఉందని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో పార్టీ కోసం పనిచేసిన వారికి దశలవారీగా మంచి పదవులు లభిస్తాయని  తెలిపారు.  గత దశాబ్ద కాలం నుంచి తాను కాంగ్రెస్‌ ‌పార్టీని నమ్ముకుని ఉన్నానని, కాబట్టే నేడు ఎమ్మెల్సీగా, టిపిసిసి అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం దక్కిందన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గడపకు చేరేలా ప్రతి కాంగ్రెస్‌ ‌కార్యకర్త కృషి చేయాలని ఆయన సూచించారు.

కాంగ్రెస్‌ ‌పార్టీలోనే రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు అన్నారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా ప్రజా పాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. ప్రతి కాంగ్రెస్‌ ‌కార్యకర్త కష్టపడి పనిచేసే మంచి గుర్తింపు తీసుకురావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో స్పోర్టస్ ‌చైర్మన్‌ ‌శివసేన రెడ్డి, యూత్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివ చరణ్‌ ‌రెడ్డి, ట్రైనింగ్‌ ‌క్యాంప్‌ ఇం‌చార్జ్ ‌సీతారాం, కో -ట్రైనర్‌ ‌శివిచవాన్‌, ‌సురభి ద్వివేది, కలేద్‌, ‌కే. రాకేష్‌ ‌రెడ్డి యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com