-
వారిపై జీహెచ్ఎంసీ కమీషనర్ అమ్రపాలి ఆగ్రహం
-
నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు-అమ్రపాలి
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ కమీషనర్ గా బాధ్యతలు చేపట్టాక డైనమిక్ గా పనిచేస్తున్నారు ఐఏఎస్ అధికారి అమ్రపాలి. సమయం చిక్కినప్పుడల్లా నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ పారిశుద్యానికి సంబందించి పౌరుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన దృష్టికి వచ్చిన పార్కింగ్ అంశంపై జీహెచ్ఎంసీ కమీషనర్ సీరియస్ అయ్యారు. ఇటీవల ఆమ్రపాలి సిటీలోని కొన్ని థియేటర్స్, మల్టీప్లెక్స్ లను అధికారులతో కలిసి తనిఖీ నిర్వహించారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్స్, కూకట్ పల్లి, సికింద్రాబాద్ లోని థియేటర్లలో అక్రమంగా కస్టమర్ల నుంచి పార్కింగ్ ఫీజు వసూళ్లు చేస్తున్నట్లు గుర్తించారు అమ్రపాలి.
అంతే కాకుండా సింగిల్ స్క్రీన్ కలిగిన కేటగిరీలో అనుమతి తీసుకుని మూడు, నాలుగు స్క్రీన్ లు నిర్వహిస్తున్నట్టు సైతం గుర్తించారు కమీషనర్. ఆయా ధియోటర్స్, మల్టీప్లెక్స్ ల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు జీహెచ్ ఎంసీ అధికారులు. అకపై ధియేటర్స్, మల్టీఫ్లెక్స్ ల్లో అక్రమంగా పార్కింగా ఫీజు వసూలు చేసినా, నాసిరకం ఆహార పదార్థాలు పెట్టినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కమీషనర్ అమ్రపాలి. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లు, పెద్ద పెద్దా షాపింగ్ మాల్స్ లో తొలి 30 నిమిషాల పాటు ఎలాంటి పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దని చెప్పారు.