Sunday, November 17, 2024

ఫ్రెండ్ పుట్టినరోజు పార్టీ.. స్కూల్లో బీరు తాగిన అమ్మాయిలు

ఈ మధ్య కాలంలో కొందరు స్కూల్ విద్యార్డులు పెడదారి పడుతున్నారు. మెట్లో నగరాల్లోని పాఠశాలల్లో విద్యార్ధులు వ్యసనాలకు లోనవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌ లోని స్కూల్ లో జరిగిన ఘటన ఇందుకు అద్దం పడుతోంది. బిలాస్‌పుర్‌ జిల్లాకు చెందిన భట్‌చౌరా గ్రామ ప్రభుత్వ పాఠశాలలో స్నేహితురాలి పుట్టినరోజు వేడుకల్లో కొందరు విద్యార్థినులు బీరు తాగిన ఘటన కలకలం రేపుతోంది.

ఆ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధిని పుట్టిన రోజు సందర్బంగా తోటి స్నేహితురాళ్లతో కలిసి స్కూల్ లోనే పార్టీ చేసుకున్నారు. అందరు కలిసి బీరు తాగారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అమ్మాయిలు తరగతి గదిలో కూర్చొని బీరు తాగిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

జులై 29న చిత్రీకరించిన ఈ వీడియోలు, ఫొటోలను ఆ విద్యార్థుల్లో ఒకరు తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన డీఈవో టి.ఆర్‌.సాహు విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. విచారణ కమిటీ సంబంధిత విద్యార్థులు, ఉపాధ్యాయుల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. సరదాగా బీరు బాటిళ్లను చేతుల్లోకి తీసుకొని ఊపామని, అంతేగాని తాము బీరు తాగలేదని విద్యార్థినులు కమిటీ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.

ఈ ఘటనతో ప్రమేయమున్న విద్యార్థుల తల్లిదండ్రులకు సైతం నోటీసులు పంపి, వివరణ కోరుతామని డీఈవో చెప్పారు.పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్కూల్‌ ప్రిన్సిపల్, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఏదేమైనా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular