Friday, November 8, 2024

రాజ్‌ ‌పాకాలకు రెండ్రోజుల సమయం ఇవ్వండి

  • జన్వాడ ఫామ్‌హౌస్‌ ‌కేసులో హైకోర్టులో విచారణ
  • విచారణకు హాజరు కాని విజయ్‌ ‌మద్దూరి
  • తన ఫోన్‌ ‌బదులు మరొకరి ఫోన్‌ ఇచ్చిన విజయ్‌
  • కెటిఆర్‌ ‌సతీమణిని విచారించిన పోలీసులు

జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసుకు సంబంధించి కేటీఆర్‌ ‌బామ్మర్ది రాజ్‌పాకాల దాఖలు చేసిన లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణకు హాజరయ్యేందుకు రాజ్‌పా కాలకు 2 రోజుల సమయం ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. జన్వాడ ఫామ్‌ ‌కేసు విచారణలో ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసుల తరఫున ఏఏజీ కోర్టుకు తెలపగా.. నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్లాలని న్యాయస్థానం సూచించింది.

కాగా, తెలంగాణలో సంలనం సృష్టించిన జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌రేవ్‌ ‌పార్టీపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్‌ ‌బామ్మర్ది రాజ్‌ ‌పాకాల, విజయ్‌ ‌మద్దూరిని పోలీసులు ఈ కేసులో ఏ1, ఏ2  నిందితులుగా చేర్చారు. ఈ క్రమంలో జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ ‌చేయాలని ప్రయత్నిస్తున్నారని.. తనను అరెస్ట్ ‌చేయకుండా పోలీసులకు ఆదేశాలివ్వాలని తెలంగాణ హైకోర్టులో రాజ్‌ ‌పాకాల లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పోలీసుల ముందు హాజరయ్యేందుకు రాజ్‌ ‌పాకాలకు రెండు రోజుల సమయం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular