Wednesday, March 12, 2025

“సిల్వర్ జూబిలీ”కి చేరువలో గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమి

సినిమా రంగంలో శిక్షణ కేవలం ఆ రంగంలో రాణించడానికి మాత్రమే కాకుండా… ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కు ఎంతగానో దోహదపడుతుందని అంటున్నారు గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమి అధినేత – టాలీవుడ్ లీడింగ్ క్యాస్టింగ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ “దీపక్ బలదేవ్ ఠాకూర్”. సినిమా రంగంతో అత్యంత సన్నిహిత అనుబంధం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన దీపక్… ఈ రంగాన్ని కెరీర్ గా మలచుకోవాలని బాల్యంలోనే ఫిక్స్ అయిపోయారు. కమల్ హాసన్, నాగార్జున వంటి సూపర్ స్టార్స్ ను తీర్చి దిద్దిన సుప్రసిద్ధ నట శిక్షణాలయం “ఆశా కె.చంద్ర ఫిల్మ్ ఇనిస్టిట్యూట్”లో తర్ఫీదు పొందిన బలదేవ్… అదే ఇనిస్టిట్యూట్ లో అసిస్టెంట్ ఫ్యాకల్టీగానూ పని చేయడం గమనార్హం. ఆ సమయంలో ఆర్తి అగర్వాల్, వైభవ్ రెడ్డి (కోదండరామిరెడ్డి తనయుడు) వంటి వారితో ఇంటరాక్ట్ అవుతూ మోటివేట్ అయిన ఠాకూర్… హైద్రాబాద్ లో అందరికీ అందుబాటులో సరైన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లేకపోవడాన్ని గుర్తించి… ఫిల్మ్ అకాడమి స్థాపించానని చెబుతారు.

స్క్రిప్ట్ డిమాండ్ కు తగ్గట్టుగా నటీనటులను ఎంపిక చేయడంలో సిద్ధహస్తులైన దీపక్… తన వద్ద శిక్షణ పొందినవారు సినిమా రంగంలోని వివిధ విభాగాల్లో స్థిరపడేవరకు వారికి మార్గదర్శకత్వం వహిస్తారు. మరో రెండేళ్లలో “సిల్వర్ జూబిలీ”కి చేరువలో ఉన్న “గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమి”ని భారతదేశంలోని అత్యున్నత శిక్షణాలయాల్లో ఒకటిగా తీర్చిదిద్దడం తన లక్ష్యమని చెబుతారు. “క్యాస్టింగ్ డైరెక్షన్” పరంగానూ విలువలతో కూడిన ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాలన్నది తన ధ్యేయమని చెప్పే ఈ ఆల్ రౌండర్… ప్రతి కాలేజి, యూనివర్సిటీలో ఫిల్మ్ ట్రైనింగ్ ను సిలబస్ లో భాగంగా చేయాలని పిలుపునిస్తారు. ఈ విషయాన్ని మాటల్లో చెప్పడమే కాకుండా చేతల్లోనూ చూపిస్తూ… ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీతో ఈమేరకు అవగాహన ఒప్పందం చేసుకుని ఉండడం దీపక్ బలదేవ్ దార్శనికతకు అద్దం పడుతుంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com