Thursday, April 3, 2025

రైలు కార్యకలాపాల భద్రతపై జిఎం అరుణ్ కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష

రైలు కార్యకలాపాల భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సమీక్ష నిర్వహించారు. సోమవారం సికిందరాబాద్‌లోని రైల్ నిలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఆర్. ధనంజయులు, వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ , హైదరాబాద్, విజయవాడ, గుంతకల్ , గుంటూరు, నాందేడ్ తదితర మొత్తం ఆరు డివిజన్‌లకు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్‌లు (డీఆర్‌ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. జోన్ వ్యాప్తంగా వర్షా కాలంలో ఆర్‌ఓబి, ఆర్‌యూబిల వద్ద నీరు నిల్వ ఉండకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాటి వద్ద గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తూ వర్షపు నీటిని ఎప్పటికప్పుడు తొలగించేందుకు సరిపడా పంపుల వ్యవస్థను, వాటర్ గేజ్ లు ఏర్పాటు చేయాలని సూచించారు.

జోన్ లో లెవల్ క్రాసింగ్ గేట్ల తొలగింపు పరిస్థితిపై ఆయన సమీక్షించారు. యార్డులలో స్టేబుల్ గా ఉంచిన కోచ్ లలో ఎలాంటి అవాంఛనీయ కార్యకలాపాలు జరగకుండా సరైన భద్రతా చర్యలు తీసుకోవాలని డివిజనల్ రైల్వే మేనేజర్‌లను ఆదేశించారు. రైల్వే ఆస్తులను కాపాడేందుకు ప్రధాన రైల్వే యార్డుల్లో సిసిటీవీ నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. జోన్ లో పొగను గుర్తించే పరికరాలను, అగ్నిమాపక యంత్రాల నిల్వలను పరిశీలించిన ఆయన, భద్రతకు సంబందించిన అన్ని అగ్నిమాపక పరికరాలు సరిపడా నిల్వలు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జోన్‌లో జరుగుతున్న పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. జనరల్ మేనేజర్ సిబ్బంది పని వేళలపై కూడా చర్చించారు. సిబ్బందికి సరైన విశ్రాంతి ఇవ్వడానికి ఖచ్చితమైన ప్రణాళిక చేయాలని డివిజనల్ రైల్వే మేనేజర్లందరికీ సూచించారు. జనరల్ మేనేజర్ రైలు కార్యకలాపాల్లో నిమగ్నమైన లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, పాయింట్‌మెన్, స్టేషన్ మాస్టర్లు, గార్డులు, ఇతర సిబ్బందికి భద్రతా విధానాలపై ప్రాక్టికల్ డెమోతో పాటు కౌన్సెలింగ్ సెషన్‌లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం దృష్ట్యా ఆర్‌ఓబి, ఆర్‌యూబిల వద్ద భద్రతకు సంబందించిన తగు జాగ్రత్తలు, వర్షపు నీరు నిల్వ ఉండకుండా అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com