Wednesday, December 4, 2024

గోదారిగట్టుతో ‘సంక్రాంతికి వస్తున్నాం’

విక్టరీ వెంకటేష్, ఐశ్వర్యరాజేష్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ఇది వారి సక్సెస్ ఫుల్ కొలాబరేషన్ లో హ్యాట్రిక్ మూవీ. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మ్యూజిక్ ప్రమోషన్లు మేకర్స్ ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు సాంగ్ విడుదల చేయడంతో ప్రారంభమయ్యాయి.
గోదారి గట్టు లీడ్ పెయిర్ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ జంటగా అలరించిన రొమాంటిక్ ట్రాక్. భాస్కరభట్ల రచించిన ఈ పాట భార్యాభర్తల మధ్య చిలిపి సరదాలని అందంగా ప్రజెంట్ చేసింది. వారు షేర్ చేసుకునే ఆప్యాయత, ప్రేమను ప్రదర్శిస్తూనే, ఒక బాండింగ్ లో హ్యుమరస్ ఆర్గ్యుమెంట్స్ ని హైలైట్ చేస్తుంది. జానపదాన్ని టచ్‌ చేస్తూ.. ఈ పాటని భీమ్స్‌ సిసిరోలియో అద్భుతంగా కంపోజ్‌ చేశారు. రమణ గోగుల యూనిక్ స్టయిల్ మెలోడీకి అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది. మధు ప్రియ మెస్మరైజ్ చేసే వాయిస్ పాట ఆకర్షణను మరింత పెంచింది. ఈ ట్రైయాంగిల్ క్రైమ్ కథలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular