Tuesday, May 13, 2025

గోదారి గట్టు పైన వెంకటేష్‌తో ఐశ్వర్య

విక్టరీ వెంకటేష్ ఎక్స్-కాప్ గా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ సింగిల్ గోదారి గట్టుకు సంబంధించిన అప్‌డేట్‌తో వచ్చారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. రమణ గోగుల పాడిన ఈ పాట ఆయన కమ్ బ్యాక్ ని సూచిస్తుంది. ఈ బ్రీజీ రొమాంటిక్ మెలోడీకి భాస్కరభట్ల రిరిక్స్ రాశారు.
సాంగ్ పోస్టర్ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ మధ్య ఒక బ్యూటీఫుల్ మూమెంట్, వెన్నెల రాత్రి నేపథ్యంలో సెట్ చేయబడింది. పౌర్ణమి ఆకాశంలో అందంగా వుంది, అద్భుతమైన సెట్టింగ్స్ మధ్య రొమాంటిక్ మూమెంట్స్ ని ఆస్వాదిస్తున్న జంట ఆకట్టుకుంది.

 

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com