మహారాష్ట్రలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో నాసిక్ జిల్లాలో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నది ఒడ్డున గల ఆలయాలు పూర్తిగా నీటిలో మునిగి పోయాయి. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. గోదావరి ఉధృతి దృష్ట్యా ఎవరూ నది ఒడ్డుకు వెళ్ల వద్దని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు. గంగాపూర్ డ్యాం నుంచి ఆదివారం నీటిని విడుదల చేయడంతో గోదావరి నీటి మట్టం పెరిగింది. దీంతో, రాంకుండ్ ప్రాంతం లోని పలు ఆలయాలు నీట మునిగాయి.