Sunday, April 6, 2025

అడవివరము లో దుర్గాదేవి అమ్మ వారి ఘటాలు ఊర్రేగింపు

  • భక్తి శ్రద్దలతో బోనాలు సమర్పణ
  • అగ్నిగుండం తొక్కిన భక్తులు
  • గణేష్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దసరా ఉత్సవాలు

సింహాచలం: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలల్లో భాగంగా సింహాచలం ఆయిల్ మిల్ వద్ద శ్రీ గణేష్ సేవా సంఘం ఆధ్వర్యంలో విజయ దశమి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే దుర్గా దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు బోనాలు సమర్పణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో చేపట్టారు. అమ్మవారి బోనాలు, ఘటా లు, విగ్రహాలు తో గ్రామం లో ఊరేగింపు నిర్వహించారు. వివద రకాల నైవేద్యాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భవాని మాలలు ధరించిన భక్తులు, మహిళలు పాల్గొని అగ్నిగుండం తొక్కారు.

ఈ సందర్భంగానే శ్రీ గణేష్ సేవా సంఘం అసోసియేషన్ అధ్యక్షులు, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయ సలహా మండలి సభ్యులు, జాతీయ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు అమ్మవారు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా వినాయక చవితి, దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ నవరాత్రి పూజా కార్యక్రమంలలో అధిక సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొని పూజలు చేశారన్నారు. అమ్మవారి దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.అమ్మవారి కరుణా కటాక్షాలు అందరితోపాటు తన కుటుంబంపై కూడా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com