ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ భారత్, పాకిస్తాన్ యుద్ధం ఆపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. రేయింబవళ్ళు నేను పాకిస్తాన్, భారత్ మధ్య జరిగే యుద్ధాన్ని ఆపడం గురించే చర్చలు జరుపుతున్నానని ఆయన అన్నారు. ఇటీవలె అమెరికాకు వెళ్ళి సీనియర్ నేతలందరినీ తాను కలిసి వచ్చినట్లు. ఈ ఇరు దేశాల మధ్య జరిగే ఘర్షణ ఆపడం కేవలం తానొక్కడివల్లే అవుతుందని చెబుతున్నారు. అందుకే శనివారం మోదీని కలిసి ఆదివారం పాకిస్థాన్ వెళ్ళినట్లు తెలిపారు. ఇప్పటికే ఇరు దేశాల ఘటర్షణపై చర్చలు ప్రారంభించానని మీడియా సమావేశంలో కే.ఏ పాల్ తెలిపారు.