బంగారు ఆభరణాలు పోవడంతో మనస్తాపంతో ఓ మహిళ రెండున్నరేళ్ల కుమారుడితో పాటు మూడో అంతస్తు నుంచి దూకింది. ఈ ఘటన హైదరాబాద్ ఆగమయ్య నగర్‌లోని చోటు చేసుకుంది. వలస్థలిపురం పోలీసుల కథనం ప్రకారం చింతల్కుంటకు చెందిన సుధేష్ణ (28) నాలుగేళ్ల కిందట అమ్మదయ కాలనీకి చెందిన నోముల ఆశీష్ కుమార్తో వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు ఆరుష్ కుమార్ ఉన్నాడు. అయితే ఈ నెల 16న సుదేష్ణ నాచారంలో జరిగిన బంధువుల శుభకార్యానికి వెళ్లింది. తన ఏడు తులాల బంగారు ఆభరణాలు చోరికి గురయ్యాయి. అవి దొరక్కపోవడంతో ఆమె మనస్తాపానికి గురైంది. మంగళవారం ఆగమయ్య నగర్‌లోని తన ఇంట్లో మూడు అంతస్తు నుంచి కుమారుడితో పాటు కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. బాబుకు స్వల్పగాయాలు కావడంతో బయటపడ్డాడు.