పసిడి ధరలు మరోసారి కొనుగోలుదారులకు షాకిచ్చాయి. అసలు తగ్గేదే లే అంటూ పరుగులు పెడుతున్నాయి. ఆగస్టు 17వ తేదీ శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(తులం)పై రూ.1,150 పెరిగి రూ.72,770కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,050 పెరగడంతో రూ.66,700గా ఉంది. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీపై వెండి ధరపై రూ.2,000 పెరిగి.. రూ.91,000గా పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరం విజయవాడలోనూ ఇవే ధరలున్నాయి.