-
తగ్గిన బంగారం ధర
-
తెలుగు రాష్ట్రాల్లో తగ్గుతున్న గోల్డ్ రేట్
అమెరికాలో ఎన్నికలు పూర్తయ్యేవరకు వడ్డీ రేట్ల తగ్గింపు ఉంచకపోవచ్చన్న అంచనాలు బలపడడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు తగ్గుతున్నది. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2,335 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో శుక్రవారం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) ధర రూ. 980, ఆర్నమెంట్ బంగారం (22 కేరెట్లు) ధర రూ. 900, 18 కేరెట్ల గోల్డ్ రేటు రూ. 740 రూపాయల చొప్పున తగ్గాయి. కిలో వెండి రేటు 500 దిగి వచ్చింది.
హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,440 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,400 గా నమోదైంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ. 54,330 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో 96,500 గా ఉంది. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.