గత రెండు రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్న క్రమంలో పసిడి కొనేవారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ లోపే మళ్లీ ధరలు పెరిగి సడెన్ షాకిచ్చింది బంగారం. గతంతో పోల్చితే స్వల్పంగా పెరగడం కాస్త ఊరట కలిగించే విషయమే. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసిందటూ నేతల మాటలతో పెట్టుబడిదారులు మళ్లీ బంగారంవైపు మగ్గు చూపుతున్నారు. బంగారాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావిస్తుంటారు. దీంతో ధరలు మళ్లీ పెరుగుతున్నాయని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో నవంబర్ 28వ తేదీన తులం బంగారం రేటు ఎంత పెరిగిందో తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో బంగారం ధరలు
హైదరాబాద్ మార్కెట్లో గత రెండ్రోజుల్లో బంగారం ధర తులంపై రూ.2400 మేర పడిపోగా ఇవాళ సడెన్‌గా పెరిగింది. ఇవాళ 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై రూ. 250 మేర పెరిగింది. దీంతో తులం ధర రూ. 71,050 వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల పసిడి రేటు ఇవాళ రూ.270 పెరగడంతో తులం రేటు రూ. 77 వేల 510 వద్దకు ఎగబాకింది. బంగారం ధర పెరిగినప్పటికీ వెండి మాత్రం మరింత తగ్గి ఊరట కల్పించింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు గత రెండ్రోజుల్లో రూ.3000 మేర తగ్గిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో రూ.100 దిగివచ్చింది. దీంతో కిలో వెండి రేటు రూ. 97 వేల 900 మార్క్ వద్దకు పడిపోయింది.