టీఎస్, న్యూస్: సరైన పత్రాలు లేకుండా అక్రమంగా ఓ కారులో తరలిస్తోన్న బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు పట్టుకున్నారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓ కారులో 34 కిలోల బంగారం, 40 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. ఈ ఆభరణాలు ముంబాయి నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.