చోరీకి వస్తువు ఏదైతే ఏంటి, బంగారంతో చేసింది అయితే చాలు అనుకున్నాడో దొంగ.. ఏకంగా రూ. 50 కోట్ల విలువైన గోల్డెన్ టాయిలెట్ దొంగిలించాడు. ఇంగ్లండ్ లోని బ్లెన్హెమ్ ప్యాలెస్ కు చెందిన ఈ 18 క్యారెట్ల గోల్డ్ కమోడ్ను 2019లో ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకు ఉంచగా జేమ్స్ షీన్ చోరీ చేశాడు. తాజాగా అతను దోషిగా తేలాడు. కాగా రూ. 4.19 కోట్ల విలువైన వస్తువుల చోరీ కేసులో జేమ్స్ 17 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.