Wednesday, January 22, 2025

వ్యవసాయ కూలీలకు శుభవార్త

– పొలాల వద్దకే బస్సులు
– కూలీల భద్రత దృష్ట్యా ప్రకాశం జిల్లా ఎస్పీ వినూత్న ఆలోచన

వ్యవసాయపనులకు వెళ్ళే కూలీలు ఎక్కువ శాతం పనులకు వెళ్ళేందుకు ఆటోలు, ట్రాక్టర్‌ ట్రక్కులు, ఇతర వాహనాలను ఆశ్రయిస్తుంటారు. ఈ వాహనాల్లో పరిమితికి మించి అధిక సంఖ్యలో పనులకు వెళుతున్న సందర్భాల్లో అక్కడక్కడా ప్రమాదాలు సంభవిస్తుండటం తెలిసిందే. ఈ ప్రమాదాల్లో ఏకంగా పలువురు ప్రాణాలు కోల్పోతుంటారు. మరి కొందరు గాయాలతో బయటపడుతుంటారు.

ఇటువంటి ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వినూత్న ఆలోచన చేశారు. వ్యవసాయ కూలీల భద్రత దృష్ట్యా పనులకు వెళ్లే సమయంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఇందుకు ఆర్టీసీ అధికారులు సానుకూలంగా స్పందించారు.

మార్కాపురంలో మొదటిసారి వ్యవసాయ కూలీలు పొలాల వద్దకు వెళ్లేందుకు బస్సు సర్వీసును ప్రారంభించారు. డీఎస్పీ నాగరాజు, సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో కూలీలను మండలాలకు పంపించారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com