Thursday, December 26, 2024

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

  • ఉగాది సందర్భంగా మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
  • ఆఫర్‌లను ఆరునెలల పాటు పొడిగిస్తున్నట్టు వెల్లడి

ఉగాది సందర్భంగా మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. రెండు రోజుల క్రితం ప్రయాణ ఆఫర్లను రద్దు చేసిన మెట్రో సంస్థ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మెట్రో రైలులో ప్యాసింజర్ ఆఫర్‌లు, సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ కార్డులను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ఎల్‌అండ్ టి ప్రకటించింది. మెట్రో కార్డుపై 10 శాతం రాయితీని ఎత్తివేస్తున్నట్టు.. రూ.59 హాలిడే కార్డును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెట్రో యాజమాన్యం తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మళ్లీ వెనక్కి తగ్గిన యాజమాన్యం మరో ఆరు నెలలు ఈ ఆఫర్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే ఎల్ అండ్ టి, మెట్రో రైలు యాజమాన్యం సరికొత్తగా కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. తరుచుగా మెట్రోలో ప్రయాణించే వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. దీని ద్వారా ఎంత ఎక్కువగా మెట్రో సేవలు వినియోగించుకుంటే అన్ని ఎక్కువ రివార్డులు పొందవచ్చు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో స్పెషల్ కస్టమర్ లాయల్టీ స్టాల్ ఏర్పాటు చేశారు. ఇక్కడ లాయల్టీ ఫ్రోగ్రామ్‌కు అర్హత కలిగిన ప్రయాణికులు తమ రివార్డును క్లెయిమ్ చేసుకోవచ్చు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com