మెదక్ జిల్లాలో ప్రతి ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నలను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మెదక్ జిల్లాలో ప్రతి ఎకరాకు 8 క్వింటాల్ల జొన్నలను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయటం వల్ల రైతులను మిగతా పంటను ఎవరికి అమ్ముకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్న సమాచారం తెలుసుకొని వెంటనే మార్క్ ఫెడ్ ద్వారా ప్రతి ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నలను కొనుగోలు చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శి గారికి లేఖ రాశారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శి మంత్రి దామోదర్ రాజనర్సింహ రాసిన లేఖకు తక్షణం స్పందించారు. మెదక్ జిల్లాలో ప్రతి ఎకరాకు 8 క్వింటాళ్ల నుండి 12 క్వింటాళ్ల వరకు పెంచుతూ జొన్నలను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ తీసుకున్న ప్రత్యేక చొరవ వల్ల మెదక్ జిల్లాలో జొన్న రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.