Thursday, December 12, 2024

ఎపిలో గూగుల్ వ్యూహాత్మక పెట్టుబడులకు విశాఖపట్నం కేంద్రంగా మారనుంది

అమరావతి,11 డిసెంబరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూగుల్ వ్యూహాత్మక పెట్టుబడులకు విశాఖపట్నం కేంద్రంగా మారనుంది.గూగుల్ సంస్థకు చెందిన ప్రతినిధుల బృందం బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసింది.ఈ ప్రతినిధి బృందానికి గూగుల్ గ్లోబల్ నెట్‌వర్కింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (GGNI) వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే నాయకత్వం వహించారు.
వివిధ కృత్రిమ మేధ(AI) కార్యక్రమాలపై సహకరించే ప్రక్రియలో భాగంగా గూగుల్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య డిసెంబర్ 5న విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ఈ బృందం పర్యటన జరిగింది.భారతదేశంలో గూగుల్ కార్యకలాపాలు,దాని భవిష్యత్తు ప్రణాళికలు మరియు ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా ప్రతిపాదించిన వ్యూహాత్మక పెట్టుబడుల ప్రణాళికలపై ఈప్రతినిధి బృందం ముఖ్యమంత్రికి వివరించింది.

గూగుల్ గ్లోబల్ నెట్వర్క్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఉపాధ్యక్షుడు బికాష్ కోలే మాట్లాడుతూ గూగుల్‌కు ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామి రాష్ట్రమని పేర్కొన్నారు. భవిష్యత్తులో చేపట్టనున్న ముఖ్యమైన కొత్త కార్యక్రమాల గురించి ఆయన తన ఆసక్తిని వ్యక్తం చేశారు.

ఈసందర్భంగా ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన నాయకత్వంలో చేసిన కృషి ఫలితంగా ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిపై ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఐటి రంగం ఘణనీయమైన అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు.అంతేగాక దేశంలో ఐటీ రంగాన్ని ఆంధ్రప్రదేశ్ ఎలా మారుస్తుందో సియం తెలియజేశారు. రాష్ట్రంలో గూగుల్ ప్రతిపాదించిన పెట్టుబడులను స్వాగతిస్తున్నట్టు సియం చంద్రబాబు పేర్కొన్నారు. అంతేగాక గూగుల్ సంస్థకు అవసరమైన ప్రోత్సాహకాలను అందించనునచనట్టు సియం హామీ ఇచ్చారు.

ఈ చర్యలు రాష్ట్రంలో పటిష్టమైన సాంకేతిక పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం మరియు ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు దోహద పడనున్నాయి.లక్ష్యంగా పెట్టుకున్నాయి. గూగుల్ సంస్థ రాష్ట్ర భాగస్వామ్యంతో పురోగమిస్తున్నందున గూగుల్ గ్లోబల్ మరియు స్థానిక బృందం క్రమం తప్పకుండా నిమగ్నమవ్వడం కొనసాగించనున్నాయి.దీని కోసం రెండు వైపులా వ్యూహాత్మక సహకార అవగాహనా ఒప్పందం పై కూడా సంతకం చేశాయి.

ఈకార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఐటి శాఖామాత్యులు నారా లోకేశ్ ఇటీవల తన అమెరికా పర్యటనలో భాగంగా గూగుల్ లీడర్‌షిప్‌తో తన సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు.అక్కడ గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడానికి మరియు ఆసంస్థ యొక్క పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో చర్చించే అవకాశం కూడా లభించిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

కొత్త ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారుల అభిప్రాయాల్లో గణనీయమైన మార్పును సాధించింది.కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లోనే రాష్ట్రం ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్,టాటా గ్రూప్,ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ మరియు భారత్ ఫోర్జ్ వంటి గ్లోబల్ మరియు ఇండియన్ మేజర్‌ల నుండి పెద్ద ఎత్తున పెట్టుబడుల ప్రతిపాదనలను ఆకర్షించింది. ఈ పరిణామాలు కేవలం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికే పరిమితం కాకుండా యావత్ దేశానికి ఐటి రంగం అభివృద్ధికి ఒక గ్రోత్ ఇంజిన్‌గా దృఢంగా నిలబెట్టానున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular