Monday, March 10, 2025

గోపీచంద్, సంకల్ప్ రెడ్డి న్యూ ప్రాజెక్ట్‌ ప్రారంభం

మాచో స్టార్ గోపీచంద్, విజనరీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ హిస్టారికల్ ఎపిక్ మూవీని ఈరోజు గ్రాండ్ గా లాంచ్ చేశారు. లాంచింగ్ ఈవెంట్ కి కోర్ టీం, ప్రత్యేక అతిథులు హాజరయ్యారు.

ఐబి 71 (స్కై బ్యాక్ డ్రాప్), ఘాజీ (వాటర్ బ్యాక్ డ్రాప్) అంతరిక్షం (స్పెస్ బ్యాక్ ట్రాప్) చిత్రాలతో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు పొందిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఇప్పుడు సరికొత్త టెరిటరీలోకి అడుగుపెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఫైర్ ఎలిమెంట్ ని క్రియేటివ్ గా ఎక్స్ ఫ్లోర్ చేయనున్నారు. భారతీయ చరిత్రలో కీలకమైన, మరచిపోయిన సంఘటన విజువల్ వండర్ గా ప్రజెంట్ చేయనున్నారు.

ఈ చిత్రంలో గోపీచంద్‌ నెవర్ బిఫోర్ రోల్ లో కనిపించనున్నారు. ఇది ఆయన వెర్సటాలిటీ హైలెట్ చేస్తుంది. 7వ శతాబ్దంలో జరిగే ఈ సినిమా, ఒక ముఖ్యమైన, ఇంకా అన్వేషించబడని చారిత్రక సంఘటనని ప్రేక్షకుల ముందుకు అద్భుతంగా తీసుకొస్తోంది. భారతీయ వారసత్వ మరచిపోయిన అధ్యాయానానికి జీవం పోస్తుంది.

ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. హిట్‌ 1, హిట్‌ 2, గీత గోవిందం, సైంధవ్ వంటి విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన మణికంధన్ ఎస్ డీవోపీగా పని చేస్తున్నారు. చిన్నా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. పృథ్వీ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. అద్భుతమైన ప్రతిభావంతులైన కోర్ టీమ్‌, హై ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమా రూపొందుతోంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com