అల్లుఅర్జున్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్
అల్లు అర్జున్ వివాదంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకు తెచ్చారని అన్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ ఛైర్మన్ దిల్‌రాజు పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన కిందిస్థాయి నుంచి ఎదిగారని అన్నారు. వైఎస్సార్సీపీ విధానాల తరహాలో తెలంగాణలో వ్యవహరించలేదని పవన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బెనిఫిట్ షోలకు రేవంత్ రెడ్డి అవకాశం కల్పించారని గుర్తు చేశారు. టికెట్ ధరలు పెంపునకు కూడా అవకాశం కల్పించారని పవన్ కల్యాణ్ అన్నారు. అల్లు అర్జున్ విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని, తెర ముందు, వెనుక ఏం జరిగిందో తెలియదని, ఇలాంటి ఘటనల్లో తాను పోలీసులను తప్పుపట్టను అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. అల్లుఅర్జున్ బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్ళిఉంటే బావుండేదేమో. గతంలో చిరంజీవి కూడా అభిమానులతో కలిసి సినిమాలు చూడడానికి వెళ్ళేవారని కాకపోతే ఆయన ముసుగు వేసుకుని వెళ్ళేవారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.