Wednesday, April 2, 2025

వ్యవసాయ భూముల క్రయ, విక్రయాల్లో చోటుచేసుకున్న తప్పొప్పుల సవరణకు ప్రభుత్వం అవకాశం

కార్డు ద్వారా ర్యాటిఫికేషన్, రెక్టిఫికేషన్, క్యాన్సిలేషన్ డీడ్స్‌కు ధరణి పోర్టల్ రాక ముందు వ్యవసాయ భూముల క్రయ, విక్రయాల్లో చోటుచేసుకున్న తప్పొప్పుల సవరణకు అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సమయంలో రిజిస్ట్రేషన్ జరిగిన భూములకు సంబంధించి పేరు, విస్తీర్ణం, సరిహద్దులు తప్పుగా పడడంతో మ్యుటేషన్‌కు సమస్య తలెత్తింది. ప్రస్తుతం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ల బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించారు. దీంతో సేల్‌డీడ్‌లలో పొరపాట్లను సరిదిద్దేందుకు ఎవరికీ అధికారం లేకపోవడంతో తాజాగా, ఈ బాధ్యతలను సబ్ రిజిస్ట్రార్లకు కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టైటిల్ డీడ్స్ డిపాజిట్స్‌కు ముందు జరిగిన వాటి సవరణ బాధ్యతలను తిరిగి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకే అప్పగించింది. ఈ మేరకు మెమో నెం. జి3/12055/2023 ద్వారా సబ్ రిజిస్ట్రార్ల ఈ బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ఆధారంగా రిజిస్ట్రేషన్లలో ర్యాటిఫికేషన్, రెక్టిఫికేషన్, క్యాన్సిలేషన్ వంటివి చేసేందుకు అనుమతి ఇచ్చారు. గతంలో కార్డు ద్వారా చేసిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌లలో తలెత్తిన వాటిని సరిదిద్దేందుకు అవకాశం కల్పించారు. సరిదిద్దిన డాక్యుమెంట్ల ఆధారంగా తిరిగి ధరణి పోర్టల్లో పెండింగ్ మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లభించినట్టయ్యింది.

స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ దగ్గర పాత డేటా
ఇప్పటికే దీనికి సంబంధించిన టెక్నికల్ పనిని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పూర్తి చేశారు. ఈ కార్డు సిస్టం ద్వారా ర్యాటిఫికేషన్, రెక్టిఫికేషన్, క్యాన్సిలేషన్ డీడ్స్ చేసేలా ఈ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అదేవిధంగా వ్యవసాయ భూముల డేటా కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ దగ్గరే ఉండడంతో అదనంగా పాత రిజిస్ట్రేషన్ల డేటాను కూడా రెవెన్యూ శాఖ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు అందించింది. ఇప్పటి నుంచి ధరణికి ముందు వ్యవసాయ భూముల క్రయ, విక్రయాల్లో చోటు చేసుకున్న తప్పొప్పుల సవరణకు సబ్ రిజిస్ట్రార్ దగ్గర స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com