Friday, September 20, 2024

జినోమ్ వ్యాలీని పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దుతాం

జినోమ్ వ్యాలీని పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దుతాం
నూతన ఆవిష్కరణలకు సానుకూల వాతావరణం
వచ్చే నాలుగేళ్లలో లారస్ రూ.2,500 కోట్ల పెట్టుబడి
2800 మంది నిపుణులకు ఉద్యోగాలు
జినోమ్ వ్యాలీలో రూ.3,000 కోట్ల పెట్టబడులు
పలు పరిశ్రమలను ప్రారంభించిన తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
జినోమ్ వ్యాలీని ఏషియాలోనే ఆధునాతన ఫార్మా, పరిశోధనలు, లైఫ్ సైన్సెస్ చిరునామాగా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. నూతన ఆవిష్కరణలకు సంబంధించిన సానుకూల వాతావరణాన్ని తాము కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనిని సద్వినియోగం చేసుకుని దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. మౌలిక సదుపాయాల అభివృద్ది, విస్తరణ పనులకు సంబంధించి హామీ ఇచ్చిన మేరకు పనులు పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. కేంద్రీకృత రసాయన శుద్ధి ప్లాంటు, రోడ్ల విస్తరణ, పచ్చదనం పెంపొందించడం లాంటి సదుపాయాలతో జినోమ్ వ్యాలీని ఒక ఆకర్షణీయ ఉత్పాదన, పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.నగర శివారులోని జినోమ్ వ్యాలీలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రూ.3,000 కోట్లకు పైబడిన పెట్టబడులతో ఏర్పాటు చేసిన ఔషధ పరిశ్రమ, ఆర్ అండ్ సెంటర్, మౌలిక సదుపాయాల కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. లారస్ లేబరెటరీస్ యూరప్ కు చెందిన కెఆర్ కెఏ అనే బహుళ జాతి సంస్థతో కలిసి ఏర్పాటు చేసిన ఉత్పాదన కేంద్రాన్ని ప్రారంభించారు. లారస్ వచ్చే నాలుగేళ్లలో ఈ సదుపాయంలో రూ.2,500 కోట్ల పెట్టుబడి పెడుతుంది. 2800 మంది నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయి. 3జివి అనే భవనాల సముదాయాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన రూ.105 కోట్ల ఈ భవన సముదాయం పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే పలు పరిశోధన సంస్థల ద్వారా వెయ్యి మందికి ఉద్యోగాలు దొరుకుతాయన్నారు. 3జివి 1,50,000 చ.అడుగుల్లో ఈ సముదాయాన్ని నిర్మించింది. 8.5 ఎకరాలల్లో బయోపొలిస్ అనే సంస్థ ఏర్పాటు చేయనున్న భవన సముదాయానికి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేసారు. రూ. 700 కోట్ల వ్యయంతో బయోపొలిస్ ఇక్కడ పది లక్షల చదరపు అడుగుల్లో అన్ని వసతులతో కూడిన ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇందులో ప్రయోగశాలు, ఆర్ అండ్ సెంటర్లు, అంకుర సంస్థలకు స్థలాన్ని అద్దెకిస్తారు. ఈ కాంప్లెక్స్ పూర్తయినే వెంటనే కార్యకలాపాలు ప్రారంభించడానికి పలు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. అవన్ని కార్యరూపం దాలిస్తే 6,500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అనంతరం శ్రీధర్ బాబు జినోమ్ వ్యాలీ అభివృద్ది, విస్తరణపై 30 పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ఇందులో భారత్ బయోటెక్, సింజీన్, బయోలజికల్- ఇ, జెఎఎంపీ లాంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు ఉన్నారు. జినోమ్ వ్యాలీ కార్యక్రమాల్లో శ్రీధర్ బాబుతో పాటు టీజిఐఐసి ఛైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, మేడ్చెల్ జిల్లా కలెక్టర్ గౌతం పొత్రు, టిజిఐఐసి ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, లైఫ్ సైన్సెస్, ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్, టిజీఐఐసి సిఇఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Ritu Sharma Latest Photos

Ishitha Raj Spicy Pics

Shruthi Hassan Latest Albhum