Friday, January 10, 2025

Bhubharati “భూభార‌తి”కి గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

త్వరలోనే అమల్లోకి కొత్త రెవెన్యూ చట్టం

చారిత్రాత్మ‌క‌మైన‌ భూ భారతి చ‌ట్టాన్ని గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ఆమోదించారు. దీంతో వీలైనంత త్వ‌ర‌లో ఈ చ‌ట్టాన్ని అమ‌లులోకి తీసుకురానున్నారు. భూ భారతి చట్టం ఆమోదముద్ర పత్రాన్ని మంత్రి పొంగులేటీ గురువారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టాన్ని త్వరగా అమల్లోకి తీసుకువ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తెలంగాణ ప్ర‌జానీకానికి మెరుగైన‌, స‌మ‌గ్ర‌మైన రెవెన్యూ సేవ‌లను స‌త్వ‌ర‌మే అందించాల‌న్న ఆశ‌యంతో భూభార‌తి చ‌ట్టాన్ని తీసుకురావ‌డం జ‌రిగింది.

రాష్ట్రంలో భూ స‌మ‌స్య‌లకు శాశ్వ‌త ప‌రిష్కారం చూపేలా భూభార‌తి చ‌ట్టాన్ని రూపొందించామ‌ని , ఈ చ‌ట్టంలో పాలుపంచుకున్న ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌జ‌లంద‌రి అభిప్రాయాల‌ను క్రోడీకరించి సామాన్యుల సంక్షేమ‌మే ధ్యేయంగా భూభార‌తి చ‌ట్టాన్ని తీసుకురావ‌డం జ‌రిగింది. ఈ చ‌ట్టానికి సంబంధించిన విధి విధానాల‌ను రూపొందించ‌డంపై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని అధికారుల‌కు సూచించారు.

రెవెన్యూ చ‌ట్టం -2020 వ‌ల్ల తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్ర‌జ‌లు, రైతులు అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కోన్నారు . భూ స‌మ‌స్య‌లేని గ్రామం తెలంగాణ‌లో లేదు. గ‌త ప్ర‌భుత్వం త‌మ వ్య‌క్తిగ‌త స్వార్ధం కోసం ప్ర‌యోజ‌నాల కోసం రెవెన్యూ వ్య‌వ‌స్ద‌ను పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. గత ప్రభుత్వంలో కొందరి గుప్పిట్లోనే కొందరికే పరిమితమైన రెవెన్యూ సేవలను గ్రామస్థాయి వరకు అందించడానికి మా ప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపట్టింది . గ్రామాల‌లో రెవెన్యూ పాల‌న‌ను చూడ‌డానికి ప్ర‌తి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించ‌బోతున్నామ‌ని ఇందుకు సంబంధించిన క‌స‌రత్తు కొలిక్కివ‌చ్చింది. “ అని మంత్రి పొంగులేటీ చెప్పారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com