Friday, January 31, 2025

గవర్నర్‌ ఫోన్‌ ట్యాప్‌..!

తెలంగాణలో సంచలనం సృష్టించిన టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏకంగా గవర్నర్ ఫోన్‌ను ట్యాపింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. నవంబర్ 2023 సంవత్సరంలో 15 రోజుల పాటు త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాప్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఇంద్రసేన రెడ్డి పీఏను అధికారులు విచారించిన సమయంలో ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం ఇంద్రసేనరెడ్డి త్రిపుర గవర్నర్‌గా ఉన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌లో ఇప్పటి వరకు కాంగ్రెస్‌కు సంబంధించి నేతల ఫోన్లే ట్యాపింగ్‌ గురైనట్లు అంతా భావించారు. కానీ ఈ ఫోన్‌ ట్యాపింగ్‌లో బీజేపీకి సంబంధించి నాయకుల పేర్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం త్రిపుర గవర్నర్‌గా ఉన్న ఇంద్రసేనరెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ అయినట్లు అధికారులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఇంద్రసేనా రెడ్డి పీఏను కూడా విచారించారు అధికారులు. ఇంద్రసేనరెడ్డి సంబంధించిన అన్ని వ్యవహారాలను పీఏ చూసుకున్న నేపథ్యంలో.. ఆయనను ఇందులో సాక్షిగా పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి గతంలో ఇంద్రసేన రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గవర్నర్‌గా ఉన్న సమయంలో ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాప్ చేయడం వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అనేదానిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపనున్నారు. ఇప్పటి వరకు దాదాపు 300 మంది నాయకులు, బిజినెస్‌మ్యాన్‌లు, రియల్‌ఎస్టేట్ వ్యాపారుల ఫోన్‌లు ట్యాప్ చేసినట్లు ఒక ప్రాధమిక అంచనాకు వచ్చిప్పటికీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com