బాలీవుడ్‌కా భాయ్ సల్మాన్‌ఖాన్ స్టైలే వేరప్పా. ఎప్పుడూ అభిమానుల గుండెల్లో ఐకాన్‌గా నిలుస్తాడు. స్పార్క్ ఉన్న సూట్లు, స్టైలిష్ క్యాజువల్స్.. ఇతర డిజైనర్ దుస్తుల్లో ప్రతిసారీ సిగ్నేచర్ స్టైల్ తో ఆకట్టుకుంటాడు. అతడి ఛామింగ్ లుక్స్ కి ప్రత్యేకించి ఫాలోయింగ్ ఉంది. కానీ ఎందుకో ఒక్కసారిగా వింతగా మారాడు. అందరిలో అనుమానాలు రేకెత్తించాడు. తాజాగా ఓవర్ ది టాప్ లుక్ తో అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసాడు. కొందరు అతడిని గోవిందాలా మారాడేమిటీ? అని కామెడీలు చేస్తున్నారు. సల్మాన్ కూడా రణ్ వీర్ లా ట్రై చేయాలనుకున్నాడా? కానీ ఇది ఇంకేదో అయింది.. పూర్తిగా తేడా కొట్టింది! అని కొందరు నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. సల్మాన్ ముంబై లోని ఓ డబ్బింగ్ స్టూడియో వెలుపల కనిపించినప్పుడు ఇలా బోల్డ్ డ్రెస్ లో కనిపించాడు. అతడి కొత్త రూపం నిజానికి ఫ్యాషన్ ఔత్సాహికులలో ఉత్సాహం పెంచింది. కానీ ప్రతిసారీ జెంటిల్ మేన్ శైలితో ట్రెండ్ సెట్టింగ్ సెలక్షన్స్ తో అలరించే సల్మాన్, లూయిస్ విట్టన్ మోనోగ్రామ్ జాకెట్ ప్రింటెడ్ దుస్తుల్లో వింతగా కనిపించాడు. ప్రింటెడ్ క్రూ లేయర్డ్-నెక్ టీ-షర్ట్ , యాసిడ్-వాష్డ్ డెనిమ్ జీన్స్ ట్రిపుల్-టోన్డ్ బ్లూ ఎల్వీ జాకెట్ తో తో అతడు కొంత విచిత్రంగా కనిపించాడు. అతడి చెవిపోగులు, బేస్ బాల్ క్యాప్, హై-యాంకిల్ బ్లాక్ స్నీకర్స్, చంకీ రింగులు, స్టేట్‌మెంట్ వాచ్ అతడి బ్రాస్‌లెట్ వంటివి సిగ్నేచర్ స్టైల్ ని ఎలివేట్ చేసినా కానీ, అతడు ధరించిన దుస్తులు ఎబ్బెట్టుగా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సల్మాన్ అభిమానులు అయోమయంలో ఉన్నారు. అతడు గోవిందాను చూసి స్ఫూర్తి పొందాడా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.