రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కులగణన చేయాలన్న అసెంబ్లీ తీర్మానం మేరకు జీవో జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కులగణనకు సుమారు రూ.150 కోట్లు ఖర్చవుతుందని బిసి కమిషన్ అంచనా వేసింది. గడిచిన అసెంబ్లీ సమావేశాల్లో, రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ప్రభుత్వ ప్రవేశపెట్టిన ఏకగ్రీవ తీర్మానంపై అఖిల పక్షాలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే సర్వే చేపడుతున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా పేర్కొన్నారు.