Tuesday, November 19, 2024

ఈనెల 20వ తేదీన గల్ఫ్ బాధిత కుటుంబాలకు క్స్‌గ్రేషియా

  • సిఎం చేతుల మీదుగా ఎక్స్‌గ్రేషియా
  • 17 మంది బాధిత కుటుంబాలకు రూ.85 లక్షల కేటాయింపు

మేనిఫెస్టోలో ‘గల్ఫ్ కార్మికుల సంక్షేమం, ఎన్నారైల సంక్షేమం’ కోసం ఇచ్చిన హామీ మేరకు గల్ఫ్‌లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం అందించబోతుంది. ప్రభుత్వం ఈ మేరకు గత సెప్టెంబర్‌లో జీఓ నంబర్ 205 జారీ చేసింది. అందులో భాగంగా ఈనెల 20వ తేదీన ఈ ఎక్స్‌గ్రేషియాను అందించనుంది. ఈనెల 20వ తేదీన సిఎం రేవంత్‌రెడ్డి వేములవాడ పర్యటించనున్న సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 17 మంది బాధిత కుటుంబాలకు ఈ ఎక్స్‌గ్రేషియా అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.85 లక్షలను కేటాయించింది. గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలన్న నిర్ణయంపై టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్, అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, కాంగ్రెస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, టిపిసిసి గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేశ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

పిల్లలకు గురుకులాల్లో సీట్లు..
పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ మృత్యువాత పడుతున్న కార్మికుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి కుటుంబాలకు స్వాంతన కలిగించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి డిసెంబర్ 7, 2023 నాటి నుంచి గల్ఫ్‌లో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్ష పరిహారం ప్రభుత్వం అందించనుంది. అలాగే గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలు, సవాళ్లు తదితర అంశాలపై అధ్యయనానికి సలహా కమిటీ ఏర్పాటు, ప్రత్యేకంగా ప్రవాసీ ప్రజావాణి నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకులాల్లో సీట్ల కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ మృతుల వివరాలు..
1. గంగిపెల్లి తిరుపతి, దుబాయి, యూఏఈ (బూరుగుపల్లి, బోయిన్‌పల్లి)
2. దాసరి బాబు, ఓమన్ (బోయిన్‌పల్లి)
3. కైర నాగయ్య, సౌదీ అరేబియా (చందుర్తి)
4. పోతుగంటి భూమయ్య, సౌదీ అరేబియా (చందుర్తి)
5. బైరి వెంకటేశం, ఇరాక్ (ఓబులాపూర్, ఇల్లంతకుంట)
6. ఏనుగుల భాస్కర్, దుబాయి, యూఏఈ (ఓబులాపూర్, ఇల్లంతకుంట)
7. బోయిని గణేశ్, దుబాయి, యూఏఈ (వంతడుపుల, ఇల్లంతకుంట)
8. కారవాని దేవయ్య, దుబాయి, యూఏఈ (గంభీరావుపేట)
9. ఇకృతి యెల్లం గౌడ్, దుబాయి, యూఏఈ (నిమ్మపెల్లి, కోనరావుపేట)
10. పిట్ల మహేశ్, సౌదీ అరేబియా (వెంకటయ్య కుంట, ముస్తాబాద్)
11. గెరిగంటి అంజయ్య, దుబాయి, యూఏఈ (మల్లారెడ్డిపేట, ముస్తాబాద్)
12. సిలివేరి నాంపెల్లి, ఓమన్ (రామన్నపల్లి, తంగళ్లపల్లి)
13. దురిశెట్టి కొండయ్య, దుబాయి, యూఏఈ (బాలానగర్, వేములవాడ)
14. పెండ్యాల చంద్రకాంత్, దుబాయి, యూఏఈ (నూకలమర్రి, వేములవాడ రూరల్)
15. మాదాసు విజయ్, ఓమన్ (ఆచన్నపల్లి, వేములవాడ రూరల్)
16. పల్లి అంజయ్య, బహ్రెయిన్ (అక్కపల్లి, ఎల్లారెడ్డిపేట)
17. నిమ్మల రాజు, బహ్రెయిన్ (రాచర్ల బొప్పాపూర్, ఎల్లారెడ్డిపేట).

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular