Sunday, March 16, 2025

గ్రూప్‌-1 అభ్యర్థుల పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

న్యూ ఢిల్లీ : తెలంగాణ గ్రూప్‌-1 అభ్యర్థుల పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో అన్ని అంశాలూ స్పష్టంగా చెప్పిందని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోవడం సరికాదని పేర్కొంది.

ఫలితాల విడుదలకు ముందే తుది విచారణ ముగించాలని హైకోర్టుకు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 రద్దు చేయాలని కోరుతూ గ్రూప్‌-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తీర్పు వచ్చే వరకు పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. జీవో 55నే అమలు చేయాలని కోరినా సీఎం పట్టించుకోవడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com