Sunday, November 17, 2024

రేపట్నుంచి హాల్ టికెట్లు

  • మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనున్న టీజీపీఎస్సీ

రాష్ట్రంలో 563 గ్రూప్‌– 1 పోస్టుల భర్తీకి జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష జరగనున్నది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుందని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ మరోసారి ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే.. అంటే 10 గంటల తర్వాత గేట్లు మూసివేయబడతాయని చెప్పారు. జూన్ 1న మధ్యాహ్నం 2 గంటల నుంచి హాల్‌టికెట్లు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. బయోమెట్రిక్‌ ఇవ్వని అభ్యర్థుల జవాబు పత్రాలు మూల్యాంకనం చేయబోమని స్పష్టంచేశారు.

ఈ సందర్భంగా అభ్యర్థులకు పలు సూచనలు జారీ చేశారు. అభ్యర్థులకు ఓఎంఆర్‌ షీట్లు ఇస్తామని, అందులో ఉన్న సూచనల ప్రకారం.. వివరాలు రాయాలి. బబ్లింగ్ చేయాలని, పరీక్ష రాసేటప్పుడు అభ్యర్థులకు సౌకర్యార్థం ప్రతి అరగంటకు బెల్‌ మోగించి సమయాన్ని చెప్తామని, బయోమెట్రిక్‌ను పరీక్ష కేంద్రంలో ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. పరీక్ష సమయం ముగిసేవరకు అభ్యర్థులు పరీక్ష కేంద్రాన్ని విడిచి వెళ్లకూడదని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular