గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. పరీక్ష కీతోపాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని టీజీపీఎస్సీ వెబ్‌సైట్ https:// www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచింది. గురువారం నుంచి ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వాటిని ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్టు తెలిపింది ప్రాథమిక కీ, మాస్టర్ ప్రశ్నాపత్రంపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వచ్చే సోమవారం (జూన్ 17) వరకు అక్కడే ఇచ్చిన టెక్ట్స్ బాక్స్‌లో ఇంగ్లిష్‌లో తెలపవచ్చని పేర్కొంది. వాటికి సంబంధించిన ఆధారాలను అప్‌లోడ్ చేయాలని సూచించింది.