Tuesday, March 11, 2025

జూన్​ 9న గ్రూప్​–1 ప్రిలిమ్స్​ ప్రకటించిన టీఎస్​పీఎస్సీ

టీఎస్ న్యూస్ : ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే పెండింగ్​లో ఉన్న పోస్టులను క్లియర్​ చేస్తున్నది. కొత్త పోస్టులను అదనంగా కలుపుతున్నది. ఇటీవల 60 పోస్టులను కలిపి 563 పోస్టలతో గ్రూప్​–1 నోటిఫికేషన్​ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్​–1 కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. కాగా, జూన్​9న గ్రూప్​–1 ప్రిలిమ్స్​ పరీక్షను నిర్వహిస్తున్నట్లు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం నోట్​ విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షను జూన్​ 9న నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.

ప్రిలిమ్స్​ తర్వాత ఆక్టోబర్​లో మెయిన్స్​ ఉండే అవకాశాలున్నాయి.అయితే, గ్రూప్​–1 ప్రిలిమ్స్​ జూన్​ 9న నిర్వహిస్తుండటంతో.. గ్రూప్​–2,3 పరీక్షలను కూడా ఆగస్టులోగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పేపర్ల లీకేజీ కారణంగా ఈ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. నిర్వహించిన పరీక్షలు రద్దు అయ్యాయి. ఇప్పుడు అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com