అభ్యంతరాల విండో ఓపెన్, అబ్జెక్షన్స్ నమోదుకు ఛాన్స్
తెలంగాణలో ‘గ్రూప్ -2’ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ని టీజీపీఎస్సీ శనివారం విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే జనవరి 18 నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో తెలియజేయవచ్చు. అభ్యంతరాల నమోదు కోసం ప్రత్యేక వెబ్ లింకును టీజీపీఎస్సీ ఏర్పాటు చేసింది. ఈ అభ్యంతరాలను ఇంగ్లిష్‌లో మాత్రమే నమోదు చేసి, ఆధారాలను జత చేయాలని టీజీపీఎస్సీ సూచించింది. పోస్టు/వాట్సప్/ఎస్ఎంఎస్/ఫోన్/వ్యక్తిగతంగా సమర్పిస్తే పరిగణనలోకి తీసుకోబోమని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.
గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష కీ కోసం అభ్యర్థులు https://websitenew.tspsc.gov.in/ అధికారక వెబ్సైట్లోకి వెళ్ళాలి.
✦ గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్ కీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
✦ అభ్యర్థులు తమ టీజీపీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలను నమోదు చేయాలి.
✦ డేటా పై క్లిక్ చేస్తే ప్రిలిమినరీ కీలతో పాటు మాస్టర్ ప్రశ్నపత్రం ఓపెన్ అవుతుంది.
✦ ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీలను పొందవచ్చు.
ప్రత్యేక లింక్ ద్వారానే అభ్యంతరాలు…
✦ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసిన వెబ్‌లింక్ ద్వారా మాత్రమే అభ్యర్థులు తమ అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది.
✦ ఆన్లైన్ ద్వారా మాత్రమే అభ్యర్ధులు అభ్యంతరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్స్ లేదా ఇతర రాతపూర్వక మార్గాల్లో అభ్యంతరాలను సమర్పిస్తే పరిగణనలోకి తీసుకోరు.
✦ అభ్యర్థులు అభ్యంతరాలతో పాటు సరైన సమాధానానికి సంబంధించిన రుజువులు లేదా రిసోర్సు కాపీలను పీడీఎఫ్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది.
✦ అభ్యర్థులు తమ టీఎస్పీఎస్సీ ఐడీ, గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్ నెంబర్, పుట్టినతేది వివరాలు నమోదు చేసి అభ్యంతరాలు సమర్పించాలి.
✦ ఇంగ్లిష్‌లోనే అభ్యంతరాలు నమోదుచేయాలి.