Wednesday, April 2, 2025

గ్రూప్స్​ పరీక్షల తేదీలు ఖరారు

టీఎస్​, న్యూస్​:రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ కీల‌క ప్రక‌ట‌న చేసింది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ప‌రీక్షల‌కు సంబంధించిన తేదీల‌ను ఖ‌రారు చేసింది. గ్రూప్ -2 రాత‌ప‌రీక్షల‌ను ఆగ‌స్టు 7, 8 తేదీల్లో, గ్రూప్​ –3 పరీక్షలను న‌వంబ‌ర్ 17, 18 తేదీల్లో నిర్వహించ‌నున్నారు. అక్టోబ‌ర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించ‌నున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. జూన్ 9వ తేదీన గ్రూప్–-1 ప్రిలిమ్స్ నిర్వహించ‌నున్నట్లు ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ప్రక‌టించిన సంగ‌తి తెలిసిందే. గ్రూప్-1 కింద 563, గ్రూప్-2లో 783, గ్రూప్-3 కింద 1388 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com