గ్రూప్–-1 ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. గ్రూప్–-1 పరీక్షలపై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వివిధ రకాల అభ్యంతరాలతో అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం వాటిని కొట్టివేసింది. దీంతో గ్రూప్-1 ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. గతంలో గ్రూప్-1 నియామకాలకు సంబంధించి పలువురు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వారి పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అభ్యర్థులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా, తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. కేసుల అడ్డంకులు తొలగిపోవడంతో టీజీపీఎస్సీ త్వరలో గ్రూప్-1 ఫలితాలు విడుదల చేయనుంది.