Monday, March 10, 2025

హైదరాబాద్ మెట్లో రైల్ ప్రయాణంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రయాణంలో ఓ వ్యక్తి రికార్డు నెలకొల్పాడు. హైదరాబాద్ మెట్రో మూడు కారిడార్లలోని 57 స్టేషన్ల పరిధిలో 2 గంటల 41 నిమిషాల 31 సెకన్లలో ప్రయాణించి ఏకంగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించాడు. హైదరాబాద్ కు చెందిన ఔత్సాహికుడు, పరిశోధకుడు శశాంక్‌ మను ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్‌ లోని అన్ని మెట్రో రైలు 57 స్టేషన్ల పరిధిలో 2 గంటల 41 నిమిషాల 31 సెకన్లలో చుట్టేసిన ఘనతతో ఈ రికార్డు మను సాధించాడు.

గతంలో ఢిల్లీ మెట్రో రైలు స్టేషన్లన్నింటి పరిధిలో 15 గంటల 22 నిమిషాల సమయంలో శశాంక్‌ మను ప్రయాణించాడు. ప్రజారవాణాను ప్రోత్సహించేందుకు, మన దేశంలోని ప్రపంచ స్థాయి మెట్రో సదుపాయాలను అందరికి తెలియజెసేందుకు శశాంక్‌ మను మెట్రో నగరాల్లో ఈ తరహా ప్రయాణాలు చేస్తున్నారు. హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రయాణంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు శశాంక్ మను. హైదరబాదా మెట్రో రైల్ వర్గాలు ఆయనను ప్రత్యేకంగా అభినందించాయి.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com