ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మధిర మండలం కిష్టాపురం ఎస్సీ గురుకుల కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయివర్ధన్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్, కాలేజీల్లో ఏదో ఒక సమస్య బయటకు వస్తూనే ఉంది. ఓ పక్క ఫుడ్ పాయిజన్‌తో పిల్లలు సతమతం అవుతుంటే.. మరోపక్క ఆత్మహత్యలు కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. మధిర మండలం కిష్టాపురం ఎస్సీ గురుకుల కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయివర్ధన్ కాలేజీపై అంతస్తులోని డాక్యుమెంటరీలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయాడు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
విద్యార్థి మృతిపై అనుమానాలు:
విద్యార్థి మృతిపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్‌కి వెళ్లారు. అనంతరం విద్యార్థి మృతి చెందిన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బిడ్డ మృతి చెందడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు అంటున్నారు.