ఎస్‌ఎల్‌బీసీ టన్నైల్‌లో కార్మికుల మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యంకాగా, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఈ సొరంగంలో జరిగిన ప్రమాదంలో పంజాబ్ కు చెందిన గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. పంజాబ్ కు చెందిన గురుప్రీత్ సింగ్ సొరంగంలో టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గా పని చేస్తున్నారు. అమెరికా కు చెందిన రాబిన్ సన్ కంపెనీలో ఉద్యోగిగా ఆయన టీబీఎమ్ ఆపరేటర్ గా చేస్తున్నారు. గురుప్రీత్ సింగ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ 25 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేస్తామని సీఎం ప్రకటించారు. మృత దేహాన్ని పంజాబ్ లోని వారి స్వగ్రామానికి పంపించారు.