Friday, December 27, 2024

విదేశాల్లోనూ చేనేత ఎగ్జిబిషన్లు

• అసెంబ్లీలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
• చేనేతకు చంద్రబాబు పాలన ఎప్పుడూ స్వర్ణయుగమే
• 50 ఏళ్లకు చేనేత కార్మికులకు రూ.4 వేల పెన్షన్లు
• 6 నెలల్లో 3 ఆప్కో షోరూమ్ ల ఏర్పాటు
• త్వరలో 2 వీవర్ శాలల ఏర్పాటు
• 10 క్లస్టర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం…
• ఆదిత్య బిర్లా గ్రూప్ సహకారంతో క్లస్టర్ల ఏర్పాటు
• త్వరలో 5 శాతం జీఎస్టీ రియింబర్స్ మెంట్ కు చర్యలు
• మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్
• నూలు కొనుగోలుకు సబ్సిడీ
• చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకం
• 2014-19 నాటి పథకాలన్నీ అమలు చేస్తాం : రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత

అమరావతి : చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచుతూ, నేతన్నలకు 365 రోజులు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత,జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. చేనేత వస్త్రాల మార్కెటింగ్ కల్పించడంలో భాగంగా ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహించనున్నామన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం చేనేత పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై పలువురు సభ్యుల అడిగిన ప్రశ్నలకు మంత్రి సవిత సమాధానమిచ్చారు. జగన్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలతో పాటు చేనేత రంగం కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయిందన్నారు. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించకపోవడంతో పాటు నేతన్న సంక్షేమాన్ని గాలికి వదిలేశారన్నారు. దీంతో ఎందరో చేనేత కార్మికులు బలవర్మరణాలకు పాల్పడ్డారన్నారు. రోజు రోజుకూ పెరిగిపోతున్న పెట్టుబడుల వ్యయం, అమ్మకాల్లేక చేనేత వస్ట్రాలు గుట్టగుట్టలుగా పేరుకపోవడంతో పాటు చేసిన అప్పలుతీర్చలేక నేతలన్న ఆత్మహత్యలకు పాల్పడరాన్నారు. యువగళం పాదయాత్రలో లోకేశ్, బస్సు యాత్ర చేపట్టిన సీఎం చంద్రబాబు నేతన్నల కష్టాలను స్వయంగా చూశారన్నారు. ఆనాడే నేతన్నలను ఆదుకుంటామని, గౌరవప్రదమైన జీవనం కొనసాగించేలా ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

చంద్రబాబు పాలన ఎప్పుడూ నేతన్నలకు స్వర్ణయుగమే…
2014లో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నా నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేనేత పరిశమ్రకు ఎంతో ప్రాధాన్యమిచ్చారని మంత్రి సవిత వెల్లడించారు. చేనేత రంగ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. పావలా వడ్డీతో వడ్డీపై రాయితీ ఇచ్చామన్నారు. చేనేత వస్త్రాల అమ్మకాలకు ఆప్కో ద్వారా 20 నుంచి 30 శాతం ప్రత్యేక రిబేట్ ఇచ్చామన్నారు. త్రిఫ్ట్ పథకంతో నూలు, రంగుల, రసాయినా కొనుగోలుపై 40 శాతం అందజేశామన్నారు. చేనేత సహకార రంగాలకు మార్కెటింగ్ ప్రోత్సాహం కూడా అందించామన్నారు. పవర్ లూమ్ యూనిట్లకు 50 శాతం టారిఫ్ రాయితీ అందించామన్నారు.

నేతన్నలకు అన్యాయం చేసిన జగన్
2019 తరవాత వచ్చిన జగన్…నేతన్నలకు తీవ్ర మోసం చేశాడన్నారు. నా నేతన్నలు… నా బడుగు బలహీన వర్గాలు.. అని చెప్పి వారిచేత ఓట్లేసుకుని రోడ్డునపడేసి…ప్యాలెస్ లు, బంగ్లాలు కట్టుకున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ జగన్ నిలపేశాడన్నారు. నేతన్న నేస్తం పథకం కింద కేవలం వైసీపీ కార్యకర్తలకు మాత్రమే బటన్ నొక్కి సాయం చేశాడన్నారు. పోగును వస్త్రంగా మార్చి అమందని మానాన్ని కాపాడుతున్న అర్హులైన నేతన్నలకు మాత్రం జగన్ తీవ్ర అన్యాయం చేశాడని మంత్రి సవిత మండిపడ్డారు.

ఎన్నికల హామీల అమలు
యువగళం పాదయాత్రలో యువ నాయకుడు, మంత్రి నారా లోకేశ్ స్వయంగా నేతన్న కష్టాలు చూసి చలించిపోయారు. తీవ్ర కష్టాల్లో ఉన్న నేతన్నలకు ఆదుకోవాలన్న సదుద్దేశంతో మంగళగిరిలో వీవర్ శాల ను ఏర్పాటు చేశారన్నారు. ఆ వీవర్ శాల ద్వారా నేతన్నలకు 365 రోజులూ పని కల్పిస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాటి నుంచి నేతన్నలకు ఆదుకునేలా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన అన్ని హామీలను నెరవేర్చుతూ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే రూ.4 వేల చొప్పున వృద్ధాప్యపు పెన్షన్లు అందజేస్తున్నాన్నారు. త్రిఫ్ట్ ఫండ్, వీవర్స్ ముద్ర పథకాలు అమలు చేస్తున్నామన్నారు. పవర్ లూమ్ యూనిట్లకు 50 శాతం రాయితీ అందిస్తున్నామన్నారు. నేతన్నల అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయబోతున్నామని తెలిపారు.

ఆప్కో షోరూమ్ ల్లో పెరిగిన అమ్మకాలు
నేతన్నలకు మేలు కలిగేలా 200 యూనిట్లు, మర మగ్గాల కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. నేతన్నలకు ఆరోగ్య బీమా పథకం అమలు చేయబోతున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే చేనేత బజార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయవాడలోని చేనేత వస్త్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా వచ్చి ప్రారంభించారని గుర్తు చేశారు. చేనేత పరిశ్రమకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నారని, తమకు న్యాయం జరుగుతున్న నమ్మకం చేనేత కార్మికుల్లో ఏర్పడిందన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంతో అయిదు నెలల్లో ఆప్కో ద్వారా అమ్మకాలు 9.8 శాతం, రెడీ మేడ్ వస్త్రాల అమ్మకాలు(లివరీ సేల్స్) 70 శాతం పెరిగాయని తెలిపారు. త్వరలో సెల్లర్స్ అండ్ బయర్స్ సమావేశం ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి తెలిపారు. ఈ సమావేశం ద్వారా చేనేత వస్త్రాల స్టాకును విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కామర్స్ ద్వారా చేనేత వస్త్రాల విక్రయాలు చేపట్టామని, గడిచిన 6 నెలల్లో రూ.32.50 లక్షల అమ్మకాలు చేశామని మంత్రి వెల్లడించారు. 6 నెలల కాలంలో 3 ఆప్కో షోరూమ్ లు ఏర్పాటు చేశామన్నారు. ఆప్కోలో కస్టమర్లను హ్యాండిచేయడంతో పాటు మార్కెటింగ్ స్కిల్స్ పెరిగడానికి షోరూమ్ మేనేజర్లకు శిక్షణిచ్చామని మంత్రి సవిత వెల్లడించారు.

రాష్ట్రంలో 2 వీవర్ శాలల ఏర్పాటు
ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్లు నేతన్నలకు నూతన డిజైన్లపై శిక్షణిచ్చి చేనేత ఉత్పత్తులకు విక్రయాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆప్ ఫ్యాషన్ టెక్నాలజీ(ఎన్ఐఎఫ్టీ) ఏర్పాటు చేయబోతున్నామన్నారు. చేనేత వస్త్రాలపై 5 శాతం మేర జీఎస్టీ రియింబెర్స్ మెంట్ ఇవ్వబోతున్నామని తెలిపారు. కొత్తగా 10 క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నామని, ఆదిత్య బిర్లా గ్రూప్ సహకారంతో 4,5 జిల్లాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ ఏర్పాటు చేసిన వీవర్ శాల మాదిరిగా…రెండు వీవర్ శాలలు ఏర్పాటు చేయడానికి విజయనగరం, కర్నూలు ఎంపీలు ముందుకొచ్చారని, ఇందుకోసం వారు చేరో కోటి రూపాయల నిధులు కేటాయించారని తెలిపారు. చేనేతలకు చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మరోసారి రుజువైందన్నారు. చనేత వస్త్రాలు ధరించాలని, మన సంప్రదాయాలను కాపాడుకుందామని, నేతన్నలకు అండగా ఉందామని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తమ ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలు చేపట్టిందన్నారు. చేనేత వస్త్రాల అమ్మకాలతో పాటు వినియోగం పెరిగేలా ఎయిర్ పోర్టుల్లోనూ ఆప్కో షోరూమ్ లు ఏర్పాటు చేశామన్నారు. త్వరలో విదేశాల్లోనూ చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహించబోతున్నామని, ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారయినా చేనేత వస్త్రాలు ధరించాలని మంత్రి సవిత అసెంబ్లీ వేదికగా కోరారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com